Monday, January 6, 2025

పులివెందుల సంస్కృతిని అన్ని చోట్లకు తీసుకొచ్చారు: పవన్

- Advertisement -
- Advertisement -

కోనసీమ: రాజోలులో వెలిగిన దీపం రేపు రాజంపేటలో వెలుగుతుందని, పులివెందుల సంస్కృతిని అన్ని చోట్లకు వైసిపోళ్లు తీసుకొచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ ప్రసంగించారు. నేరగాళ్లు రాజకీయం చేసే రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. నేరగాళ్ల బెదిరింపులకు మంచివాళ్లు కూడా లొంగిపోతారని, కులం ఆధారంగా ఎప్పుడు రాజకీయాలు చేయలేదన్నారు.

Also Read: జర్నలిస్టుపై కాల్పులు…

వైసిపి చేసే కుల రాజకీయాలు తాను చేయలేనని పవన్  స్పష్టం చేశారు. ఓడిన తరువాత కూడా నిలదొక్కుకోవడమే గొప్ప విజయమన్నారు. రూ.200 లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడుతుందని, వేల కోట్లు దోపిడీ చేసే నేతలు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచే మార్పు మొదలు కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News