Sunday, December 29, 2024

దంపతుల మధ్య గొడవ… కుమారుడి ప్రాణం తీసి… గొంతు కోసుకున్న తల్లి

- Advertisement -
- Advertisement -

చెన్నై: దంపతుల మధ్య గొడవల నేపథ్యంలో ఇద్దరు పిల్లల గొంతు కోసి అనంతరం తల్లి గొంతు కోసుకుంది. అనంతరం కుమారుడు మృతి చెందాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం పుల్లపురం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కిల్‌పౌక్ గ్రామంలో దివ్య, రామ్ కుమార్ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు పునీత్ కుమార్(2), లక్షన్ కుమార్(4) అనే పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతుండడంతో ఆమె తన పుట్టింట్లో ఉంటుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో లక్షన్, పునీత్ గొంతు కోసి అనంతరం ఆమె గొంతు కోసింది. ఇంట్లో నుంచి ఏడుపు కేకలు వినపడడంతో స్థానికులు వారిని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పునీత్ మృతి చెందాడు. లక్షన్, దివ్య ఆరోగ్య స్థితి సాధారణంగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. వెంటనే ఆమెను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లక్షన్ ను తండ్రికి పోలీసులు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News