హైదరాబాద్: ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారుడు భారత బ్యాట్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పద్మభూషణ్ పుల్లెల గోపిచంద్ ఎక్స్‌క్లూజివ్ ఆన్‌లైన్ బ్యాట్మింటన్ స్టోర్ బ్యాట్మింటన్ హబ్.ఇన్‌ను బుధవారం ప్రారంభించారు. అత్యుత్తమ నాణ్యత కలిగిన బ్యాట్మింటన్ పరికరాలకు సంబంధించి ప్రత్యేకంగా వ్యవస్థీకృతమైన రిటైల్ మార్కెట్ సదుపాయం లేకపోవడంతో క్రీడా వ్యాపార వేత్తలు అప్రోజ్ ఖాన్, రోసక్ సచ్‌దేవాతో కలిసి గోపిచంద్ స్వయంగా స్థాపించారు. క్రీడను కొత్తగా ఆసక్తి ఉన్నవారు మొదల్కొని అత్యుత్తమ ఆటగాళ్ల వరకు ప్రతి ఒక్క బ్యాడ్మింటన్ ఆటగాడు తప్పక సందర్శించాల్సిన ఒక ఆన్‌లైన్ వేదికంగా తీర్చిదిద్దాలని లక్షంగా పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా గోపిచంద్ తెలిపారు. గత ఏడాది నుంచి ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్న నేపథ్యంలో బ్యాడ్మింటన్ క్రీడాకారుల తమ క్రీడా పరికరాల కోసం వ్యవస్థీకృత రిటైల్ మార్కెట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అయితే విశ్వసనీయమైన ఇకామర్స్ ప్లాట్‌పాం అందుబాటులో లేకపోవడంతో ఆ లోటును తీర్చడానికే బ్యాట్మింటన్ హబ్.ఇన్ ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.
బ్యాట్మింటన్ హబ్.ఇన్‌ను ప్రారంభించిన గోపిచంద్
- Advertisement -
- Advertisement -
- Advertisement -