Monday, December 23, 2024

చితిలో మృతదేహం నుంచి తలను దొంగలించి….

- Advertisement -
- Advertisement -

Pulling head of pyre burning in UP

 

లక్నో: శ్మశాన వాటికలో మృతదేహం నుంచి తలను వేరు చేసి ఎత్తుకెళ్లిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో జరిగింది. ముగ్గురు మంత్రగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… టిల్‌హార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రోలీ గ్రామంలో కుబేర్ గంగ్వార్ (60) వయసు మీదపడడంతో చనిపోయాడు. గ్రామ శివారులో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపించారు. చితిలో మృతదేహం పెట్టిన తరువాత నిప్పంటించారు. అక్కడి నుంచి అందరూ వెళ్లిపోయిన తరువాత ముగ్గురు వ్యక్తులు మృతదేహం నుంచి తల వేరు చేసి తీసుకెళ్లారు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు తెలిపడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌పి సంజీవ్ కుమార్ అక్కడికి చేరుకొని ఉపేంద్ర, సురేంద్ర కుమార్, మనోజ్ అదుపులోకి తీసుకున్నారు. పుర్రెతో పూజలు చేస్తే ధనికలం అవుతామని, అందుకే దొంగలించామని నిందితులు పేర్కొన్నారు. నిందితులపై 297 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఎస్‌పి సంజీవ్ కుమార్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News