Monday, December 23, 2024

సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా ఎంపికైన పుల్లూరి ప్రణయ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ములకలపల్లి : ములకలపల్లి గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు స్వర్గీయ పుల్లూరి చంద్రమౌళి కుమారుడు పుల్లూరి వేణుగోపాల్ జయశ్రీ దంపతుల ద్వితీయ కుమారుడు డాక్టర్ పుల్లూరి ప్రణయ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా ఎంపికైనారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తిలలో భాగంగా వైద్యశాఖలో వైధ్యాధికారుల భర్తి కొరకు జూన్ 15 న నోటిపికేషన్‌ను విడుదల చేయడం జరిగినది.

969 పోస్టులకుగాను 4803 మంది అభ్యర్దులు ధరఖాస్తు చేసుకున్నారు.ప్రభుత్వం పూర్తిగా మెరిట్ ప్రాతిపదికగా వైద్యులను తీసుకోవడం జరిగినది. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ఫలితాలలో డాక్టర్ పుల్లూరి ప్రణయ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా ఎంపిక కావడం జరిగినది.భాల్యం నుండి విద్యలో రానిస్తు ఉన్న డాక్టర్ ప్రణయ్ యంబిబిఎస్‌ను హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో ఇటీవలనే పూర్తి చేసారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News