Friday, October 18, 2024

రాష్ట్రంలో నేటి నుంచి పల్స్ పోలియో కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

Pulse polio program in Telangana from today

హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలో పోలియో చుక్కల పంపిణీ జరుగనుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు చిన్నారులకు పోలీసులు చుక్కలు వేయనున్నారు. హైదరాబాద్ లో ఫిబ్రవరి 3వరకు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగునుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 38,31,907 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. 23,331 కేంద్రాల ద్వారా రాష్ట్రంలో పోలియో చుక్కల పంపిణీ జరుగునుంది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లాలకు 50.14లక్షల పోలియో డోసులను ఆరోగ్య శాఖ పంపించింది. తప్పకుండా తల్లిదండ్రులు మీ ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ప్రభుత్వం పేర్కొంది.

Pulse polio program in Telangana from today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News