- Advertisement -
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన సిఆర్‌పిఎఫ్ జవాన్ల త్యాగాలు వృథాపోవని, దీటుగా జవాబు ఇచ్చేలా తాము కృషి చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీరులోని పుల్వామా జిల్లాలో సిఆర్‌పిఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై పాకిస్తాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేయగా ఈ దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. పుల్వామా అమర వీరులను ఈ దేశం ఎన్నటికీ మరచిపోదని, అమరులతోపాటు వారి కుటుంబ సభ్యుల త్యాగాలు వృథా పోవని రాహుల్ అన్నారు. ఈ దాడులకు దీటైన జవాబు వచ్చేలా తాము చర్యలు తీసుకుంటామని ఆయన ట్వీట్ చేశారు. పుల్వామా దాడి జరిగిన కొద్ది రోజులకే ఇందుకు ప్రతీకారంగా భారతయుద్ధ విమానాలు పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్ర శిక్షణ శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ జరిపాయి.
- Advertisement -