Thursday, January 16, 2025

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి ఆలయ పరిసరాల్లో
16 మోటార్ల సహాయంతో
వరద నీటి పంపింగ్
ఊపందుకున్న పారిశుద్ధ కార్యక్రమాలు
కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

మన తెలంగాణ/భద్రాచలం : భద్రాచలం వద్ద గో దావరి క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయినా అల్పపీడనం ప్రభావం కారణంగా మూడో ప్రమాద హెచ్చరికను భద్రాచలంలో కొనసాగిస్తున్నారు. సో మవారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 50 అడుగులకు తగ్గింది. సాధారణంగా 53 అడుగుల కు తగ్గగానే మూడవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరిస్తారు. అల్పపీడనం కారణంగా వర్షాలుపడే అవకాశం ఉన్నందున మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు. రామాలయం వద్ద విస్తా కాంప్లెక్స్, నిత్యాన్నదాన సత్రాలు ఇంకా జలమయంగానే ఉన్నాయి. కరకట్ట వద్ద స్లూయిజ్ నుండి 16 మోటర్ల సహాయంతో నీటిని గోదావరిలోకి పంపింగ్ చేస్తున్నారు.

వరదనీరు తగ్గిన కాలనీల్లో యుద్ధప్రాతిపదికన పారిశుథ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సుభాష్‌నగర్ కాలనీ, రెవెన్యూ, కొత్తకాలనీల్లో బురదను శుభ్రం చేసి బ్లీచింగ్, ఫాగింగ్, దోమల మందు పిచికారి చేస్తున్నారు. భద్రాచలంలోని పునరావస కేంద్రాలను సీసీఎల్‌ఎ డైరెక్టర్ రజత్‌కుమార్ సైనీ, ఖమ్మం కలెక్టర్ విపి గౌతమ్, పిఆర్ కమిషనర్ హనుమంతరావులు పరిశీలించారు. వరద బాధితులను ప్రభుత్వ ఆదుకుంటుందని భరోసా కల్పించారు. తక్షణ సహాయం కింద రూ. పదివేలు అందజేస్తున్నారు. రెండు నెలల పాటు 20 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వడానికి గణాంకాలు రూపొందిస్తున్నారు. పారిశుథ్య కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని పునరావాస కేంద్రాలకు నిత్యావసర వస్తువులు తరలిస్తున్నారు. నెలాఖరు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున,గోదావరి పూర్తిగా తగ్గుముఖం పట్టేదాకా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్యం..

గోదావరి పరివాహక ప్రాంతంలోని భద్రాచలం, పినపాక, అశ్వాపురం, మణుగూరు. బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో 12,227 ఇళ్లు ముంపుకు గురికాగా యుద్దప్రాతిపదికన పారిశుధ్య,వైద్య సేవలు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. దీనికి గాను మొత్తం 4434 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేసినట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News