Wednesday, January 22, 2025

పుణె కలెక్టర్ నన్ను వేధిస్తున్నారు: పూజా ఖేడ్కర్ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

వాషిం(మహారాష్ట్ర): వివాదాస్పద ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ వాషిం పోలీసులకు పుణె జిల్లా కలెక్టర్ సుహాస్ దివాసేపై వేధింపు కేసు నమోదు చేసినట్లు మంగళవారం ఒక అధికారి వెల్లడించారు.

సోమవారం రాత్రి వాషింలోని తన నివాసానికి మహిళా పోలీసు సిబ్బందిని పిలిపించుకున్న పూజా ఖేడ్కర్ పుణె జిల్లా కలెక్టర్ సుహాస్ దావాసే తనను వేధిస్తున్నట్లు కేసు నమోదు చేశారని ఆ అధికారి చెప్పారు. అయితే అంతకుముందు మహిళా పోలీసులు తన నివాసానికి ఎందుకు వచ్చారో విలేకరులకు వివరించడానికి ఆమె నిరాకరించారు. కొద్దిగా పనుండి మహిళా పోలీసు సిబ్బందిని పిలిపించానని ఆమె చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News