Saturday, January 11, 2025

సావర్కర్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

పరువునష్టం దావా కేసులో లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి పూణే ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. హిందూ సిద్ధాంతకర్త వి.డి.సావర్కర్ పై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగాను సావర్కర్ మనవడు రాహుల్ గాంధీ మీద పరువునష్టం దావా దాఖలు చేశారు. 2023 మార్చిలో లండన్‌లో రాహుల్ గాంధీ ప్రసంగించినప్పుడు కొన్ని అనుచిత వ్యాఖ్యలను చేసినట్లు ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు సావర్కర్ రాసిన పుస్తకంపై కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు.

అయితే ఎంపీ/ఎంఎల్‌ఏల కోర్టు లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. అది కూడా రూ. 25,000 షూరిటీ బాండ్ పూచీకత్తుపైన. దీనికి ముందు రాహుల్ గాంధీని వీడియో కాన్ఫరెన్స్ ద్వార కోర్టు విచారించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోహన్ జోషి కోర్టుకు షూరిటీ బాండ్ సమర్పించారు. ఇదిలావుండగా రాహుల్ గాంధీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అడ్వొకేట్ మిలింద్ పవార్ మాట్లాడుతూ కోర్టుకు రావలసిన విషయం నుంచి కూడా రాహుల్ గాంధీకి మినహాయింపును కోర్టు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 18న ఉండగలదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News