Friday, November 15, 2024

పాకిస్థాన్‌కు కీలక సమాచారం.. పుణే డిఆర్‌డిఒ సైంటిస్టు అరెస్టు

- Advertisement -
- Advertisement -

పుణే : గూఢచార్యం అభియోగాలపై స్థానిక డిఆర్‌డిఒ సైంటిస్టు ఒకరిని గురువారం ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్ ) అదుపులోకి తీసుకుంది. ఈ వ్యక్తి పేరు వెల్లడించలేదు. అయితే ఆయన పాకిస్థానీ ఏజెంట్లకు వాట్సాప్ చాట్స్‌తో దేశ కీలక భద్రతా సమాచారం అందిస్తూ వస్తున్నారని గుర్తించామని, అందుకే వలపన్ని అరెస్టు చేశారని అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో ఈ సైంటిస్టు నేరుగా కాకుండా కొందరు ఏజెంట్ల ద్వారా రహస్య సంబంధాలు నెరపుతున్నారు.

తరచూ విషయాలను తెలియచేస్తూ సందేశాలు వెలువరిస్తున్నట్లు వెల్లడైంది. అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఈ వ్యక్తి దేశ రక్షణ సమాచారాన్ని చివరికి ఫోటోల రూపంలో కూడా ప్రత్యర్థి దేశానికి చేరవేస్తున్నట్లు ప్రాధమిక సమాచారంతో వెల్లడైంది. సైంటిస్టు అందిస్తున్న సమాచారం దేశ భద్రతకు ముప్పు తెచ్చిపెడుతుందని, ఈ తీవ్ర చర్యను వెంటనే ఆటకట్టించారని అధికార వర్గాలు తెలిపాయి.

Also Read: రాహుల్‌ కు శిక్ష విధించిన సూరత్ మేజిస్ట్రేట్‌కు జడ్జిగా పదోన్నతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News