Friday, December 20, 2024

అప్పు చెల్లించనందుకు… భర్త ఎదుటే భార్యపై అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

ముంబయి: అప్పు చెల్లించనందుకు భర్త ఎదుటే భార్యపై అత్యాచారం చేసి అనంతరం వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇంతియాజ్ షేక్ అనే వ్యక్తి నుంచి దంపతులు అప్పు తీసుకున్నారు. సమయానికి అప్పు చెల్లించకపోవడంతో భర్త ఎదుటే మహిళపై ఇంతియాజ్ అత్యాచారం చేయడంతో వీడియో చిత్రీకరించాడు. వీడియోను అడ్డం పెట్టుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆమె అతడికి ఎదురు తిరగడంతో ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News