Sunday, November 17, 2024

పూణే దోపిడి దొంగల అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంతరాష్ట్ర దోపిడీ దొంగల ముఠాను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి మూడు పిస్తోళ్లు, ఆరు బుల్లెట్లు, 16బ్లేడ్లు, కత్తులు, మంకీ క్యాప్‌లు, కారు, రూ.70,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, పూణే, ఇవాత్ హడ్డీకి చెందిన అమర్ సింగ్ అలియాస్ జగ్గార్ సింగ్, లక్కీ సింగ్ అలియాస్ గబ్బర్ సింగ్, నిహాల్ సింగ్ అలియాస్ మానవ్ సింగ్, జీత్ సింగ్ అలియాస్ రాజ్‌పాల్ సింగ్, నిషాంత్ కలిసి దోపిడీలు చేస్తున్నారు.

షాపూర్, జీడిమెట్ల అక్కడికి సమీపంలోని ప్రాంతాల్లో దోపిడీలు చేసేందుకు ఈ ముఠా వచ్చింది. వీరు షాపూర్‌నగర్ సమీపంలోని ఆదర్శ బ్యాంక్ లేన్ సమీపంలో పాడుబడిన భవనంలో మకాం వేశారు. అక్కడు ఉంటూ రోజు జీడిమెట్ల పరిసరాల్లోని జూవెల్లరీ షాపులు, మార్కెట్ తదితర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. నిందితులు చోరీ చేసిన కారులో కత్తులు, పిస్తోళ్లు, దోపిడీలు చేసేందుకు కావాల్సిన ఆయుధాలతో కలిసి వచ్చారు. వీరి కదలికలపై అనుమానం రావడంతో స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఉంటున్న భవనంపై దాడి చేశారు. ఈ సమయంలో నిందితులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా అందరినీ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు.

అందరూ కరుడుగట్టిన దొంగలే…

పోలీసులు అరెస్టు చేసిన పూణేకు చెందిన ముఠాలోని వారు చాలా నేరాల్లో పాలుపంచుకున్నారు. జీత్‌సింగ్‌పై 47, అమర్ సింగ్‌పై 18, లక్కీ సింగ్‌పై 40, నిహాల్ సింగ్‌పై 40, నిషాంత్ పై 30 కేసులు ఉన్నాయి. నిందితులు మహారాష్ట్రలో మోస్ట్ వాంటెడ్ నేరస్థులుగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News