Saturday, December 21, 2024

పట్టపగలు నడిరోడ్డులో యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

ముంబయి: పట్టపగలు నడిరోడ్డులో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో యువతిపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేసిన సంఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లా సదాశివపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పెరూగేట్ ప్రాంతంలో శాంతానూ జాధవ్ అనే యువకుడు, యువతి మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతోంది. ఇద్దరు స్నేహంగా ఉండడంతో ఆమెను జాధవ్ ప్రేమించాడు. ఇద్దరు కలిసిమెలిసి కొన్ని రోజులు తిరిగారు. అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో ఆమె జాధవ్‌ను దూరం పెట్టింది. అతడి ప్రేమను ఒప్పుకోకపోవడంతో ఆమెను చంపాలని ప్రేమికుడు నిర్ణయం తీసుకున్నాడు.

Also Read: ఎలుగుబంటిని చంపి… భర్త, సోదరుడిని కాపాడిన మహిళ

మంగళవారం పది గంటల ప్రాతంలో యువతి తన స్నేహితురాలితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అతడు వెంటపడ్డాడు. సదరు యువకుడు మాట్లాడానికి ప్రయత్నించడంతో ఆమె తిరస్కరించింది. దీంతో ఆమెపై పొడవాటి కత్తితో దాడి చేశాడు. ఆమె అతడి నుంచి తప్పించుకోవడానికి శాయశక్తుల ప్రయత్నించింది. ఆమెకు చిన్నపాటి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.  యువకుడిపై ఏక్‌నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మహా వికాస్ అఘాడి డిమాండ్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News