Sunday, January 19, 2025

భర్త ముందే… సెల్ఫీ కోసం లోయలో పడిన భార్య

- Advertisement -
- Advertisement -

ముంబయి: వివాహం జరిగి సంవత్సరం కాకముందే ఓ వివాహిత సెల్ఫీ దిగుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటన మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పుణేలోని ధంకవాడికి చెందిన సునీల్ శిరస్కర్, అంకితా శిరస్కర్ సంవత్సరం క్రితం వివాహం చేసుకున్నారు. సునీల్ రైల్వే సంస్థలో లోకో పైలెట్‌గా పని చేస్తున్నారు. దంపతులు మహాబలేశ్వరం పర్యటనకు వచ్చారు. మంగళవారం ఇద్దరు కలిసి ఫోటోలు తీసుకున్నారు. మహాబలేశ్వరంలో కొండ పైనుంచి సెల్ఫీలు తీసుకుంటానని తన భర్తకు అంకితా చెప్పింది. పిట్టగోడ ఎక్కి సెల్ఫీలు తీసుకుంటుండగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. పర్యాటకులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని లోయలో పడిన అంకితా మృతదేహాన్ని బయటకు తీశారు. 350 అడుగుల లోతులో పడిపోయిందని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని అంకితా బంధువులకు అప్పగించారు. ఆమె మొబైల్ ఫోన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నీళ్లలో పడిపోయి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగాయని స్థానికులు వెల్లడించారు. అక్కడ బారీకేడ్స్ ఏర్పాటు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News