Monday, December 23, 2024

దుబాయ్‌లో బర్త్‌డే వేడుక కోసం భర్త ముక్కు పచ్చడి చేసిన భార్య

- Advertisement -
- Advertisement -

పుణే : బర్త్‌డే వేడుకకు దుబాయ్ తీసుకుపోలేదని ఓ మహిళ తన భర్తను చావబాదింది. పుణేలోని వానావ్ది ప్రాంతంలో విలాసవంతమైన నివాసిత సొసైటీ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. హాయిగా ఉన్న భార్య రేణుక పుట్టినరోజున అపరకాళిక అయింది. బర్త్‌డే దుబాయ్‌లో చేసుకుందాం, పుణేలో ఎప్పటిలాగానే చేసుకుంటే పాతచింతకాయ పచ్చడి అవుతుందని కొట్లాడింది. అయితే భర్త సారీ చెప్పి దుబాయ్‌కు వెళ్లే పరిస్థితి లేదని చెప్పాడు. దీనితో కోపం పట్టలేక ఆమె ఆయన ముక్కుపై బలంగా కొట్టింది. దీనితో భర్త ప్రాణాలు కోల్పొయ్యాడని పోలీసులు తెలిపారు.

36 సంవత్సరాల నిఖిల్ ఖన్నా నిర్మాణ రంగంలో వ్యాపారవేత్తగా ఉన్నారు. ఆరు సంవత్సరాల క్రితం 38 ఏండ్ల రేణుకను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిది ప్రేమ వివాహం . బర్త్‌డే రోజున వేడుకల గురించి ఇద్దరి నడుమ పెద్ద ఎత్తున తగవు జరిగింది. ఈ క్రమంలో ఇద్దరూ కొట్టుకున్నారు. రేణుక బలంగా కొట్టిన దెబ్బలకు నిఖిల్ ముక్కుపచ్చడి అయింది. ఓపన్ను కూడా ఊడింది. ఆగకుండా రక్తస్రావం కావడంతో ఆసుపత్రి పాలయ్యి తరువాత మృతి చెందారు. ఐపిసి పరిధిలో రేణుకపై కేసు దాఖలు చేసి, విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News