Saturday, December 28, 2024

పునీత్ పుట్టిన రోజునే ‘జేమ్స్’ విడుదల

- Advertisement -
- Advertisement -

James movie release

హైదరాబాద్: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ జీవితం అర్ధంతరంగా ముగిసిపోయిన సంగతి తెలిసిందే. అయితే అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాయింతా కాదు. కన్నడిగులు అతడిని ప్రేమగా ‘అప్పు’ అని పిలుస్తుంటారు. బాల నటుడి నుంచి పైకెదిగిన నటుడాయన. ఆయన మరణం నేటికీ చాలా మంది జీర్ణించుకోలేకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి 17న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలచేశారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్‌గా నటించారు. ప్రియా ఆనంద్ హిరోయిన్‌గా నటించారు. పునీత్ చివరి చిత్రం కావడంతో థియేటర్ల వద్ద అభిమానులు కిక్కిరిసి బారులు తీరారు. కర్నాటకలో ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా 500కు పైగా థియేటర్లలో, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250కి పైగా థియేటర్లలో, ప్రపంచవ్యాప్తంగా 4వేలకు పైగా స్క్రీన్స్‌పై ఈ సినిమాను విడుదల చేశారు. ఈ చిత్రానికి హిట్ అన్న టాక్ వచ్చింది. ఈ సినిమా చూసిన ఆయన అభిమానులు చాలా భావోద్వేగానికి లోనయ్యారు. సినిమా చూసి బయటికి వచ్చాక కొందరు ఏడ్చేశారు కూడా. ఈ ‘జేమ్స్’ సినిమా గొప్ప కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. స్క్రీన్‌ప్లే ఫాస్ట్‌గా ఉంటుంది. మంచి కథనం. చక్కని యాక్షన్ ఈ చిత్రానికి ఉన్న ప్లస్ పాయింట్లు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ విలువలు ఉన్నతంగా నిలిపారు డైరెక్టర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News