కర్ణాటక రత్న పురస్కారానికి అసలైన అర్హుడు పునీత్
అవార్డు ప్రధానోత్సవానికి హాజరైన నటులు రజనీకాంత్, ఎన్టీఆర్
మన తెలంగాణ, హైదరాబాద్ : నవంబర్ 1వ తేదీ సందర్భంగా కర్ణాటక అసెంబ్లీ విధాన సౌధలో కన్నడ రజోత్సవం నిర్వహించారు. దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం కర్ణాటక రత్న ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఆ అవార్డును మంగళవారం విధాన సౌధలో పునీత రాజ్‌కుమార్ సతీమణి అశ్విని పునీత్‌కు ప్రదానం చేసింది. ఈకార్యక్రమానికి టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్,దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. కాగా విధాన సౌధకు విచ్చేసిన సందర్బంగా ఎన్టీఆర్‌ను సిఎం బసవరాజ్ బొమ్మై ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈసందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ పిన్న వయస్సులోనే గొప్ప సాధన చేసిన పునీత్‌కు కర్ణాటక రత్న పురస్కారానికి పూర్తి అర్హులు. పునీత్ రాజ్‌కుమార్ 4 ఏళ్ల వయసులో శబరిమలై వచ్చారని, తొలిసారి తనని అక్కడ చూశా, శబరిమలై యాత్రకు 48 కిమీ కాలినడక.
రాజ్‌కుమార్ తన భుజాలపై పునీత్‌ను తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఓనటుడు 60ఏళ్లలో సాధించే కీర్తిని పునీత 21 ఏళ్లలో సాధించారు. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, తెలుగులో ఎన్టీఆర్, కర్ణాటకలో డా. రాజ్‌కుమార్‌ల సాధనకు సాటివచ్చే వ్యక్తి అని కొనియాడారు. పునీత్ మరణించిన సమయంలో తాను ఐసీయూలో ఉన్నానని, మూడు రోజుల తరువాత ఆయన మరణవార్త విని షాక్ అయ్యానని అన్నారు. పునీత్ గొప్ప మనసుకు చలించే ఆయన అంతిమ సంస్కారాలకు లక్షల మంది అభిమానులు వచ్చారని పేర్కొన్నారు. అనంతరం ఎన్టీఆర్ ప్రసంగిస్తూ పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పునీత్ నవ్వులో ఉన్న స్వచ్చత, సిరిని మరెక్కడా చూడలేదు. అహం , అహంకారాన్ని పక్కన పెట్టి,యుద్దం చేయకుండానే రాజ్యాన్ని జయించిన వ్యక్తి పునీత్ రాజ్‌కుమార్, గొప్ప వ్యక్తిత్వాన్ని స్వయంగా సాధించారని కొనియాడారు.