Monday, January 20, 2025

పుంగనూరు అంగళ్లు కేసు : 79 మంది టిడిపి నేతలకు బెయిల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పుంగనూరు నియోజకవర్గంలోని అంగళ్లు కేసులో 79 మంది టిడిపి నేతలకు ఎపి హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. టిడిపి ఎంఎల్‌సి రామ్ గోపాల్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. బెయిల్ వచ్చిన వారు ప్రతి మంగళవారం నాడు పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే కేసుల్లో మరో 30 మంది టిడిపి నేతలు ముందస్తు బెయిల్ కోసం ఎపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీరిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. పుంగనూరు అంగళ్లు కేసులో అరెస్టైన టిడిపి నేతలు, కార్యకర్తలను చిత్తూరు, మదనపల్లె, కడప జైలులో ఉన్నారు. హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుండి వీరంతా విడుదల కానున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News