- Advertisement -
అమరావతి: పుంగనూరు ఘటన దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఎ1 ముద్దాయిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేస్తామన్నారు. ఈ తానేటి వనిత మీడియాతో మాట్లాడారు. ముందే నిర్ణయించిన రూట్‌లో చంద్రబాబు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. బీర్ బాటిళ్లు, రాళ్లు, కర్రలు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగారు. అడ్డుకున్న పోలీసులపై టిడిపి కార్యకర్తలు పాశవికంగా దాడి చేశారని దుయ్యబట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసిపి, టిడిపి కార్యకర్తలు దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు వర్గాలను చెదరగొడుతుండగా పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
- Advertisement -