Thursday, December 19, 2024

పత్తి విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పత్తి విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాపారులకు హెచ్చరిక చేశారు. మంగళవారం మంత్రి పత్తి విత్తనాలకు సంబంధించి మీడియాతో మాట్లాడుతూ పత్తిసాగుకు రైతులు ఉపయోగించేది బిజి టు విత్తనాలే అని, ఇవి అన్ని కంపెనీల నుంచి ఒకటే రకంగా ఉంటాయన్నారు. ఈ విత్తనాలన్నీ ప్రైవేటు కంపెనీలే తయారు చేస్తాయన్నారు. పత్తి విత్తన ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. ఒక్కో ప్యాకేట్‌లో 450గ్రాముల విత్తనాలు ఉంటాయని ,ప్యాకెట్ ధరను 853రూపాయలుగా కేంద్రం నిర్ణయించిందన్నారు. అయితే పత్తి విత్తనాల ధరల నియంత్రణ మాత్రం రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుందని తెలిపారు.

కొన్ని కంపెనీలు దురాశతో పత్తి విత్తనాల కృత్రిమ కొరతను సృష్టించి ఎక్కువ ధరలకు మార్కెట్లో విక్రయిస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు .అధిక ధరలకు విత్తనాలు విక్రయించే కంపెనీలకు చెందిన అనుమతులు , అటువంటి డీలర్ల లైసెన్స్ లు రద్దుకు వెనుకాడం అని హెచ్చరించారు. అవసరమైన దానికన్నా అధికంగానే పత్తి విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఈ సీజన్‌లో 65 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతుందని అంచనా వేశామన్నారు. ఈ మేరకు 58,500 క్వింటాళ్ల పత్తి విత్తనాలు అవసరమవుతాయని వెల్లడించారు. మార్కెట్ లో అన్ని కంపెనీల విత్తనాలు కలిపి 77,500 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పత్తి విత్తనాల కృత్రిమ కొరత, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై సంబంధిత అధికారులు ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News