Wednesday, January 8, 2025

హిజ్రానని బయటపెట్టినందుకు శిక్ష!

- Advertisement -
- Advertisement -

లక్నో: తాను హిజ్రానన్న వాస్తవాన్ని బయటపెట్టినందుకు ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాల నియమించిన వారం రోజులకే ఒక 29 ఏళ్ల టీచర్‌ను విధుల నుంచి తొలగించింది. అయితే పాఠశాల యాజమాన్యం మాత్రం ఆ టీచర్ సరిగ్గా పాఠాలు చెప్పడంలేదన్న కారణంగానే తొలగించినట్లు స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది నవంబర్ 22న ఇంగ్లీష్, సోషల్ సైన్స్ టీచర్‌గా పాఠశాల యాజమాన్యం తనను నియమించిందని ఆ ట్రాన్స్ వుమెన్ చెబుతున్నారు. అయితే తన ఉనికిని రహస్యంగా ఉంచాలని యాజమాన్యం తనకు చెప్పిందని ఆమె తెలిపారు.

అయితే..తన శరీరాకృతి ఇతర స్త్రీల మాదరిగా లేకపోవడంతో స్కూలు సిబ్బందితోపాటు విద్యార్థులు కూడా ఎగతాళి చేయసాగారని, తన చూపులను, తన నడకతీరును వారు ఆటపట్టించడమేకాక హిజ్రా అంటూ గేలి చేయసాగారని ఆమె విలేకరులకు తెలిపారు. తమ వర్గానికి చట్టం కల్పించిన హక్కులను గురించి వారికి చెప్పడమే కాక తాను వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని కూడా వివరించానని ఆమె చెప్పారు. తన ఉనికిని బయటపెట్టానన్న కోపంతో యాజమాన్యం తనను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆమె చెప్పారు. పురుషుడిగా జన్మించిన ఆమె 2019లో ఇండోర్‌లోని భండారీ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్‌లో లింగమార్పిడి సర్జరీ చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News