చండీగఢ్: పంజాబ్ అడ్వకేట్ జనరల్(ఏజి) ఏపిఎస్ డియోల్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా అందరికీ ఆశ్చర్యకరంగా మారింది. ఎందుకంటే ఆయనను సెప్టెంబర్ 27న ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే నియమించింది. అయితే ఆయన నియమాకాన్ని కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు నవజోత్ సింగ్ వ్యతిరేకించారు. 2015 పోలీసు కాల్పుల కేసులో నిందితులైన ఇద్దరు పోలీసుల పక్షాణ డియోల్ న్యాయవాదిగా వాదించిన తరుణంలో అడ్వకేట్ జనరల్‌గా ఆయన నియమాకాన్ని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ వ్యతిరేకించారు. అయితే ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, కాంగ్రెస్ అధిష్ఠానం మధ్య జరిగిన సమావేశాల అనంతరమే డియోల్ నియామకం జరిగినట్లు సమాచారం. అడ్వకేట్ జనరల్ ను రాష్ట్రంలో సీనియర్ మోస్ట్ న్యాయవాదిగా పరిగణిస్తారు. ఆయన హోదా క్యాబినెట్ మంత్రి ర్యాంకులో ఉంటుంది.