Tuesday, January 21, 2025

దొంగలకే దొంగ ఆ పోలీసు

- Advertisement -
- Advertisement -

లూధియానా: దుబాయ్ నుంచి స్మగ్లింగ్ ద్వారా తెచ్చిన బంగారాన్ని లూటీ చేసి విక్రయిస్తూ ఓ పోలీసు అధికారి పట్టుబడ్డాడు. దాదాపు రూ. 1 కోటి విలువచేసే బంగారాన్ని తన నలుగురు సహచరులతో కలసి విక్రయిస్తూ ఒక ఎఎస్‌ఐ పట్టుబడడం సంచలనం సృష్టించింది. పది రోజుల క్రితం మొహాలీలోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో స్మగ్లర్ నుంచి ఎఎస్‌ఐ కమల్ కిషోర్(43) లూటీ చేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని సిఐఎ ఆఫీసులో కమల్ కిషోర్ పనిచేస్తున్నాడు.

దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేసి తెచ్చిన బంగారంలో సగం బంగారాన్ని అంటే దాదాపు 825 గ్రాములను, రూ. 8 లక్షల నగదును, రెండు మొబైల్ ఫోన్లను, ఒక మహీంద్ర స్కార్పియోతోపాటు స్మగ్లర్ పాస్‌పోర్టును ఈ ఐదుగురు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు లూధియానా పోలీసు కమిషనరేట్ తెలిపింది. సెప్టెంబర్ 8న మరో స్మగ్లర్ నుంచి1,230 గ్రాముల బంగారం, ఒక పిస్టల్‌ను లూధియానా కమిషనరేట్ స్వాధీనం చేసుకుంది.

దుబాయ్‌లో స్థిరపడిన పునీత్ అలియాస్ పంకజ్ అనే బంగారం స్మగ్లింగ్ ముఠా నాయకుడి వద్ద వంట మనిషిగా పనిచేస్తున్న నేహ అనే మహిళ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎఎస్‌ఐ కమల్ కిషోర్ స్మగ్లర్ నుంచి బంగారం లూటీ చేసినట్లు కమిషనరేట్ తెలిపింది. ఇప్పటికే లూటీ చేసిన బంగారంలో కొంత భాగాన్ని అమ్మివేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని కమిషనరేట్ పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News