Monday, December 23, 2024

నేడు పంజాబ్‌లో పోలింగ్

- Advertisement -
- Advertisement -
Punjab assembly election 2022
యూపిలో మూడో దశలో 59 స్థానాలకు

చండీగఢ్/ లక్నో: పంజాబ్‌లోని మొత్తం 117 స్థానాలకు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 59 స్థానాలకు (మూడో దశ) ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. పంజాబ్‌లో ప్రధానంగా కాం గ్రెస్, ఆప్, శిరోమణి అకాలీ దళ్‌బహుజన్ సమాజ్ పార్టీ కూటమి, బిజెపిపిఎల్‌సిశిరోమణి అకాలీదళ్(సంయుక్త్), సంయుక్త్ సమాజ్ మోర్చా, అలాగే వివిధ రైతు సంఘాల రాజకీయ ఫ్రంట్ బలంగా పోటీ పడుతున్నాయి. 117 స్థానాలకు 93 మంది మహిళా అభ్యర్థినులతోపాటు మొత్తం 1304 అభ్యర్థులు పోటీపడుతున్నారు. వారి భవితను తేల్చేది 2.14 కోట్ల మంది ఓటర్లు. కాగా పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. ఓట్ల లెక్కింపు మాత్రం మార్చి 10న ఉండగలదు.

ఇదిలావుండగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న కాంగ్రెస్ విద్యుత్ టారిఫ్‌ను తగ్గించడం, ఇంధన ధరలను తగ్గించడం, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చరణ్‌జిత్ సింగ్ చన్నీ 111 రోజుల పాలన వంటి నిర్ణయాలపై ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బలమైన పోటీదారుగా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది. అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వ పాలనను ప్రొజెక్ట్ చేస్తోంది. ఇదిలా ఉండగా రైతు చట్టాల విషయంలో విభేదించి బిజెపితో 2020లో సంబంధాలు తెంచేసుకున్న శిరోమణి అకాలీ దళ్ ఈసారి బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తుపెట్టుకుని పోటీపడుతోంది. శిరోమణి అకాళీదళ్ సారథిగా సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ ఉండడంతో ‘పంజాబ్ స్వంత పార్టీ’గా ఓటర్లకు ప్రొజెక్ట్ చేసుకుంటోంది. పైగా పంజాబ్‌ను బహుముఖంగా అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ(బిజెపి)- మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్(పిఎల్‌సి), సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్(సంయుక్త్)తో పొత్తుపెట్టుకుని పోటీ చేస్తోంది.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు మొత్తంగా ఏడు దశలలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా ఆదివారం అక్కడ మూడో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. 16 జిల్లాల్లో విస్తరించి ఉన్న 59 అసెంబ్లీ స్థానాలకు మూడో దశ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ దశ ఎన్నికల్లో దాదాపు 627 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 2.15 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్, ఫిరోజాబాద్, ఎటా, కస్‌గంజ్, మైన్‌పురి, ఫరుఖాబాద్, కన్నూజ్, ఈటావా, ఔరయ్యా, కాన్పూర్ దేహత్, కాన్పూర్ నగర్, జలౌన్, ఝాన్సీ, లలిత్‌పూర్, హమీర్‌పూర్, మహోబా జిల్లాల్లో ఓటింగ్ జరుగబోతోంది. ఇక కర్హాల్ అసెంబ్లీ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పోటీపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News