Wednesday, January 22, 2025

తెలంగాణ పథకాలు భేష్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ బ్యూరో: కేంద్రంలో రాబోయేది రైతు ప్రభుత్వమేనని పంజాబ్ శాసనసభ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వాన్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళ్తూ నిజామాబాద్‌లో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆహ్వానం మేరకు ఆయన ఇంట్లో స్పీకర్ అతిథ్యం స్వీకరించారు. ఈ సం దర్భంగా సాంద్వాన్ మాట్లాడుతూ కేంద్రంలో రైతు ప్రభుత్వం ఉంటేనే భారత్ విశ్వగురువుగా తయారవుతుందని పేర్కొన్నారు. రైతుకు మేలు చేస్తేనే దేశానికి మేలు జరుగుతుందని, ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు ఆ దిశగానే పాలన సాగిస్తున్నాయన్నారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ ఒక అడుగు ముందుకేసి రైతులకు అనేక ప్ర యోజనాలు కలిగే పథకాలను అమలు చేస్తున్నారని కితాబిచ్చారు.

రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు ఏ రాష్ట్రంలోలేవని, ఇంటింటికి నీరు ఇవ్వడం చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయాయని, ఆడపిల్లల వివాహాలకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద లబ్ధ్దిదారులకు లక్షా 116 రూపాయలు ఇవ్వడం, పేదలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. గతంలో తాను తెలంగాణకు వచ్చానని ఇప్పుడు తెలంగాణ అన్నిరంగాలలో పురోగతి సాధించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుందని, తద్వారా అన్నివర్గాలు సంతోషంగా ఉంటారని స్పీకర్ గుర్తుచేశారు. జై జవాన్.. జై కిసాన్ అనే నినాదాన్ని ప్రభుత్వాలు మరిచిపోయాయని, నిజానికి దేశ సరిహద్దులో కాపలాకాస్తున్న సైనికులు సైతం రైతుబిడ్డలేనని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ తరహాలోనే ఢిల్లీ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం చూస్తుంటే రాబోయే రోజుల్లో దేశంలో కేజ్రీవాల్, కెసిఆర్ ఆధ్వర్యంలో రైతు రాజ్యం రావడం ఖాయమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

ద్వితీయ స్థాయి నగరాలలోనూ ఐటి హబ్‌లను నిర్మించడం వల్ల గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభించేలా చేశారని, తెలంగాణ యువత రైతులు, పేదలు కెసిఆర్‌కు ఎంతో రుణపడి ఉన్నారన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఎంఎల్‌ఎగా గెలిచిన తర్వాత నిజామాబాద్ పట్టణ రూపురేఖలు మారిపోయాయని, ఆయన ఆధ్వర్యంలో నగరం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవనాలను సందర్శించి అధికారులను అభినందించారు. అన్ని శాఖలు ఒకే ప్రాంగణంలో ఉండడం వల్ల ప్రభుత్వ పాలన మరింత చేరువుతుందని, రాబోవు రోజుల్లో పంజాబ్‌లోనూ ఇదే తరహాలో ప్రభుత్వాలు నిర్మాణం చేస్తామన్నారు. ఆయన వెంట డిప్యూటీ స్పీకర్ జైసింగ్ రౌడీ, ఎంపి విక్రం సింగ్ సహనీ, ఎంఎల్‌ఎ కుల్వంత్ పాండోరి, అమర్‌జిత్‌సింగ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News