Monday, December 23, 2024

ఆసుపత్రిలో చేరిన పంజాబ్ సిఎం భగవంత్ మాన్

- Advertisement -
- Advertisement -

 

Bhagwant Mann

న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర కడుపు నొప్పితో ఢిల్లీలోని ప్రయివేట్ ఆసుపత్రిలో  చేరారు.  ఆయన ఆదివారం కలుషిత నీరు త్రాగిన తర్వాత కడుపు నొప్పితో బాధపడుతున్నారు. మంగళవారం రాత్రే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పంజాబ్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం దీనిని ఖండిస్తోంది. పైగా ముఖ్యమంత్రి ఆరోగ్యంగానే ఉన్నారని దబాయించి చెబుతోంది. కాలీ బీన్ అనే రిజర్వాయర్ పునరుద్ధరణ 22వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సుల్తాన్‌పూర్‌లోని లోధి పట్టణాన్ని మాన్ సందర్శించారు. అక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో ఆ రిజర్వాయర్ నుంచి గ్లాసు నీళ్లు తాగాడు. పంజాబ్‌లో ఈ జలాన్ని పవిత్రంగా భావిస్తారు. దీంతో మంగళవారం నుంచి ముఖ్యమంత్రికి కడుపునొప్పి మొదలైందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

అభిజ్ఞవర్గాల కథనం ప్రకారం, మాన్ రాత్రి అస్వస్థతకు గురైనప్పుడు చండీగఢ్‌లోని ముఖ్యమంత్రి నివాసం నుండి న్యూఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి విమానంలో తరలించారు. 48 ఏళ్ల వ్యక్తి అక్కడ చికిత్స పొందుతున్నాడు. అయితే దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. బీన్ నుండి ఒక గ్లాస్ ఫుల్ తాగుతున్న మాన్ చిత్రాలను ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ. దాని వీడియో కూడా వైరల్‌గా మారింది. బీన్ ఒడ్డున సీఎం మొక్క నాటారని, వాగులోని నీళ్లు తాగారని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News