- Advertisement -
న్యూఢిల్లీ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం దేశ రాజధాని నగరంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. సరిహద్దుల భద్రత, రైతు సమస్యలు, బాస్మతి బియ్యానికి కనీస మద్దతు ధర తదితర అంశాలపై చర్చించారు. రైతుల డిమాండ్లు, భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు లో పంజాబ్‌కు ప్రాతినిధ్యం చర్చకు వచ్చాయి. బాస్మతి బియ్యానికి కనీస మద్దతు ధర , పంజాబ్ సరిహద్దు ప్రాంతాలు, భద్రతపై చర్చించారు. ఈ డిమాండ్లన్నిటినీ పరిశీలిస్తామని అమిత్‌షా చెప్పారు. సమావేశం అనంతరం మాన్ విలేఖరులతో మాట్లాడుతూ పంజాబ్‌లో అశాంతి సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అందువల్ల అదనంగా దాదాపు 2000 మంది పారామిలిటరీ సిబ్బందిని మోహరిస్తామని చెప్పారు.
- Advertisement -