- Advertisement -
చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం మధ్యాహ్నం రెండో వివాహం చేసుకోబోతున్నారు. డాక్టర్ గుర్‌ప్రీత్ కౌర్ అనే మహిళతో చండీగఢ్ లో పరిమిత సంఖ్యలో అతిధుల సమక్షంలో మాన్ వివాహం జరగనున్నట్టు సమాచారం. గతంలో ఆయనకు ఇంద్రప్రీత్ కౌర్‌తో వివాహం జరిగినప్పటికీ ఆరేళ్ల క్రితమే ఇద్దరూ విడిపోయారు. విడాకుల తరువాత ఇంద్రప్రీత్ కౌర్ తన ఇద్దరు పిల్లలతోకలిసి అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సీఎం భగవంత్ మాన్ తల్లి, సోదరి కోరిక మేరకు ఆయన గురుప్రీత్ కౌర్‌ను వివాహం చేసుకోడానికి అంగీకరించారు. ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, పంజాబ్ కేబినెట్ మంత్రులు, మాన్ కుటుంబ సభ్యులు , సన్నిహితులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.
- Advertisement -