చండీగఢ్ : పంజాబ్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఛరణ్‌జిత్ సింగ్ ఛన్నీ శుక్రవారం తమ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను కలుసుకుని రాజీనామా పత్రం సమర్పించారు. పంజాబ్‌లో అధికారం ఇప్పుడు ఆప్ కైవసం చేసుకుంది. 117 మంది సభ్యుల అసెంబ్లీలో ఈసారి కాంగ్రెస్‌కు కేవలం 18 స్థానాలే దక్కాయి. ఆమ్ ఆద్మీపార్టీ భారతీ మెజార్టీని దక్కించుకుంది.ఈ పార్టీకి 92 స్థానాలు వచ్చాయి. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్‌తో పాటు అకాలీదళ్, బిజెపి ప్రముఖ నేతలు పలువురు పరాజయం చెందారు. శుక్రవారం ఉదయం కేబినెట్ భేటీ జరిగింది. అపజయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ శాసససభ రద్దుకు గవర్నర్‌కు సిఫార్సు చేశామని, తమ రాజీనామాను సమర్పించామని ఛన్నీ విలేకరులకు తెలిపారు. ప్రజలు మార్పు కోరుకున్నారు. ఈ విధంగా జరిగిందని, తీర్పును ఆమోదిస్తున్నామని చెప్పారు.
దిగిపోయిన ఛన్నీ.. గవర్నర్‌కు రాజీనామా లేఖ
- Advertisement -
- Advertisement -
- Advertisement -