Wednesday, January 22, 2025

చన్నీ యూ టర్న్… వ్యాఖ్యలు వక్రీకరించారని విచారం

- Advertisement -
- Advertisement -

Punjab CM Comment on Arvind kejriwal

చండీగఢ్ : పంజాబ్ లోకి యూపీ, బీహార్ వాళ్లను రానివ్వబోమని తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని ముఖ్యమంత్రి చన్నీ చెప్పారు. వాస్తవానికి తాను ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ను ఉద్దేశించి మాట్లాడానన్నారు. మరోవైపు చన్నీ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ మండిపడ్డారు. యూపీలో పుట్టిన సంత్ రవిదాస్‌ను, బీహార్‌లో పుట్టిన గురుగోవింద్‌సింగ్‌ను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. చన్నీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంకా చప్పట్లు కొట్టడాన్ని కూడా ప్రధాని తప్పుపట్టారు. ఇదేనా కాంగ్రెస్ విధానమని ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రియాంక కూడా స్పందించారు. చన్నీ వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News