గజ్వేల్ : రానున్న రోజుల్లో పంజాబ్‌ను రంగీలా పంజాబ్‌గా మారుస్తామని పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ అన్నారు. బుధవారం గజ్వేల్ నియోజక వర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్బాగంగా నిర్మించిన కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్, పంప్ హాస్, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్దరణ రాష్ట్రంలో పెరిగిన గ్రౌండ్ వాటర్ విదానాలను పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… వ్యవసాయంలో అధునిక సాంకేతికతను బాగా సద్వినియోగం చేసుకుంటూ దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. పంజాబ్‌లో ఇరిగేషన్ సిస్టమ్ దేశ విభజనకు ముందు ఏర్పాటు చేసిందన్నారు. పంజాబ్‌లో చాలా పెద్ద డ్యాంలు ఉన్నా కానీ చెరువులు లేక సమస్యగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో పంజాబ్‌లో బావులు, బోర్లతోనే పంటలు ఎక్కువగా పండుతున్నాయన్నారు.
గ్రౌండ్ వాటర్ తక్కువఅని నూతన ఒరవడి కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తెలంగాణ నీటి పారుదల మోడల్‌గా ఉందన్నారు. సాంకేతికత ఎక్కడ ఉన్న దానిని అందిపుచ్చుకొని ప్రజలకు అందించడం పాలకుల విధి అన్నారు. ఇరిగేషన్ రంగంలో తెలంగాణలో అనుసరిస్తున్న అదునాతన విధానాల్లో తమ రాష్ట్రానికి అనుకూలమైన విధానాలను పంజాబ్‌లో కూడా అమలు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. రైతుల పట్ట కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పరోక్షంగా విమర్శించారు. దేశ వ్యాప్తంగా రైతులు తీవ్ర సమస్యతో బాధపడుతున్నారన్నారు. జంతర్ మంతర్ వద్ద రైతులు అందోళనలు చేశారని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు.
దేశంలో 80 శాతం మంది వ్యవసాయయే చేస్తున్నారని తెలిపారు. అనంతరం మిషన్ కాకతీయలో అభివృద్ది పరిచిన పాండవుల చెరువు వద్ద రైతుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు మీతో కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ డిల్లి వెళ్లి విద్యావ్యవస్ధ గురించి అవగాహన తెలుసుకొని అదే తరహాలో తమిళనాడులో రూపిందించారన్నారు. మంచి వ్యవస్ధ ఎక్కడ ఉన్నా దాన్ని తమ ప్రజలకు అందించడం పాలకుల పనిగా పెట్టుకున్నామన్నారు. అరవింద్ కేజ్రీవాలత్ వచ్చాక డిల్లీ అన్ని విషయాల్లో అభివృద్ది చెందిందన్నారు. ఉచిత కరంట్, విద్యా వ్యవస్ధ, సబ్తీ దవాఖానా ఉన్నాయని తెలిపారు. మంచి మనసు విజన్ ఉన్న నాయకుడు ఉంటే ప్రాంతం ఎల్లప్పుడు అభివృద్దిలో దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజల్‌కుమార్, ఈఎస్‌సి హరేరామ్, పంజాబ్ ఇరిగేషన్ అదికారులు, గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, అదికారులు తదితరులు పాల్గొన్నారు.