Monday, December 23, 2024

కెసిఆర్‌తో నేడు పంజాబ్ సిఎం భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పంజాబ్ సిఎం భగవంత్ సింగ్ మాన్ మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు. తాజ్ కృష్ణాలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన హైదరాబాద్‌కు వస్తున్నారు. అనంతరం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌తో భేటీ కానున్నారు. పంజాబ్ రా ష్ట్ర పరిస్థితులు, దేశ రాజకీయాలపై ఈ ఇద్దరూ చర్చించుకోనున్నారు. అలాగే ఈనెల 24న పం జాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంధ్వన్‌తో పాటు మరో ఐదుగురు సభ్యుల బృందం తెలంగాణాకు రానుంది. స భ్యుల బృందంలో డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సిం గ్ రౌరీ, రాజ్యసభ ఎంపి విక్రంజిత్ సింగ్ సా హ్ని, పంజాబ్ శాసనసభ్యుడు -కుల్వంత్ సింగ్ పండోరి, స్పీకర్ కుమారుడు హర్రూప్ సింగ్, స్పీకర్ పిఎ కుల్విందర్ సింగ్‌లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News