Monday, December 23, 2024

చెత్త వేసినందుకు పంజాబ్ సిఎంకు జరిమానా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇంటి బయట చెత్తవేసినందుకు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ పంజాబ్ ముఖ్యమంత్రి నివాసంపై రూ.10,000 జరిమానా విధించింది. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సిఆర్‌పిఎఫ్) బెటాలియన్ డిప్యుటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు హర్జీందర్ సింగ్ పేరిట ఈ మేరకు చలాన్ జారీ అయింది. చలాన్‌లో పేర్కొన్న చిరునామా ఇంటి నంబర్ 7, సెక్టార్ 2, చండీగఢ్ అని ఉంది. ఇంటి నంబర్ 7, ముఖ్యమంత్రి నివాసంలో పనిచేసే సిబ్బంది వెనుక వైపున చెత్తను పారేస్తున్నట్లు స్థానికుల నుంచి అనేక సార్లు ఫిర్యాదు అందినట్లు స్థానిక బిజెపి కౌన్సిలర్ మహేషిందర్ సింగ్ సిద్ధూ తెలిపారు. ఇంటి వెనుక చెత్త పారేయవద్దంటూ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అనేక సార్లు ముఖ్యమంత్రి నివాస సిబ్బందికి నచ్చచెప్పారని, అయినా వారు వినడం లేదని ఆయన చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి నివాసానికి చలాన్ జారీ అయిందని ఆయన తెలిపారు. 44, 45, 6, 7ఇంటి నంబర్లు ముఖ్యమంత్రి నివాసంలో భాగంగా ఉన్నాయి.

Punjab CM’s Residence Fined Rs 10k by MCC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News