Monday, December 23, 2024

ప్రజాభిప్రాయం మేరకే పంజాబ్ కాంగ్రెస్ సిఎం అభ్యర్థి

- Advertisement -
- Advertisement -

ఆమ్‌ఆద్మీ రూటులో కాంగ్రెస్

Punjab Congress CM candidate by popular vote

చండీగఢ్ : పంజాబ్‌లో ప్రస్తుతం రెండు స్తంభాలాట నడుస్తోంది. ఒకరు సీఎం చెన్నీ వర్గం కాగా, మరొకరు పీసీనీ అధ్యక్షుడు సిద్దూ నవజోత్ సింగ్ వర్గం. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎటువైపు మొగ్గాలో తేల్చుకోలేక ఆమ్‌ఆద్మీ పార్టీ లాగే సీఎం అభ్యర్థితాన్ని ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే ఎంపిక చేయాలని నిర్ణయించింది. వాట్సాప్, వాయిస్ మెసేజ్‌లు, కాల్స్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను తెలుపవచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వాయిస్ మెసేజ్‌లో మొదటి ఆప్షన్‌గా సీఎం చెన్నీ పేరు, రెండో ఆప్షన్‌గా సిద్ధూ పేరును చేర్చనున్నట్టు సమాచారం. ఇక మూడో ఆప్షన్‌గా సీఎం పేరు ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లడం అన్న ఛాయిస్‌ను కూడా కాంగ్రెస్ చేర్చడానికి రెడీ అయినట్టు కాంగ్రెస్ ముఖ్య నేతలు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News