Wednesday, January 22, 2025

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Punjab Election 2022 Live Updates

చండీగఢ్/ లక్నో: పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పంజాబ్ లోని 117 స్థానాలకు నేడు పంజాబ్ లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ ను సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల బరిలో 93 మంది మహిళలు సహా 1,304 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చమ్ కౌర్ సాహిబ్, భదౌర్ స్థానాల నుంచి సిఎం చన్నీ పోటీ చేస్తున్నారు. ధురి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ సిఎం అభ్యర్థి భగవంత్ మూన్ బరిలో ఉన్నారు. అమృత్ సర్ తూర్పు నుంచి నవజ్యత్ సింగ్ సిద్ధూ పోటీ చేస్తున్నారు. పటియాలా అర్బన్ నుంచి మాజీ సిఎం అమరీందర్ సింగ్ బరిలో ఉన్నారు. జలాలాబాద్ నుంచి అకాలీదళ్ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ పోటీ చేస్తున్నారు. లంబీ స్థానం నుంచి ప్రకాశ్ సింగ్ బాదల్ పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. శిరోమణి అకాళీద్-బిఎస్పీ కూటమిగా బరిలోకి దిగాయి. బిజెపి-పిఎల్ సి,శిరోమణి అకాళీదల్ సంయుక్త పార్టీ జట్టుగా బరిలోకి దిగాయి. పంజాబ్ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News