Thursday, January 23, 2025

సోనూ సూద్ కార్ సీజ్..

- Advertisement -
- Advertisement -

Punjab Election 2022: Sonu Sood's Car Seized in Moga

చండీగఢ్‌: చండీగఢ్ : పంజాబ్ లోని మోగా శాసనసభ నియోజక వర్గంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించడానికి వెళ్తున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కు ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఆయన ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ఆయనను పోలింగ్ కేంద్రాలకు వెళ్లవద్దని ఆదేశించింది. ఆయన కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోగా నియోజకవర్గం నుంచి సోనూ సూద్ సోదరి మానికా సూద్ కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు. ఆయన ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బర్జిందర్‌సింగ్ మద్దతుదారు ఒకరు ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్దకు సోనూ సూద్ వెళ్లకుండా ఉండేందుకు ఆయన కారును స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్పారు. ఆయన ఓటర్లను ప్రభావితం చేశారా? అనే అంశంపై నివేదికను సమర్పించాలని మోగా ఎస్‌ఎస్‌పీని ఆదేశించినట్టు జిల్లా కలెక్టర్ హరీశ్ నయ్యర్ చెప్పారు. ఈ ఆరోపణలను సోనూసూద్ ఖండించారు. తాను స్థానికుడినని, తాను కేవలం పోలింగ్ కేంద్రాల బయట కాంగ్రెస్ బూత్‌ల వద్దకు మాత్రమే వెళ్లానని చెప్పారు. ఇతర అభ్యర్థులు ఓట్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని ఓ ట్వీట్ లో ఆరోపించారు.

Punjab Election 2022: Sonu Sood’s Car Seized in Moga

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News