Thursday, January 23, 2025

పంజాబ్ రైతుకు జాక్ పాట్

- Advertisement -
- Advertisement -

పంజాబ్ లోని ఓ రైతుకు జాక్ పాట్ తగిలింది. హోషియార్ పూర్ కు చెందిన శీతల్ సింగ్ మందులు కొనేందుకు మెడికల్ షాప్ కు వెళ్లాడు. మందులు కొన్నాక, పక్కనే ఉన్న లాటరీ షాప్ ను చూసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. అక్కడికి వెళ్లి ఓ లాటరీ టికెట్ కొని జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్లాడు.

కొన్ని గంటలు గడిచాయో లేదా, అతనికి లాటరీ నిర్వాహకులు ఫోన్ చేశారు. మీకు లాటరీ తగిలిందనీ, రెండున్నర కోట్ల రూపాయలు గెలుచుకున్నారని చెప్పడంతో శీతల్ సింగ్ సంతోషం అంతా ఇంతా కాదు. లాటరీలో వచ్చిన డబ్బుతో ఏం చేస్తారని అడిగితే కుటుంబ సభ్యులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటానన్నాడు. శీతల్ సింగ్ మధ్య తరగతికి చెందిన ఓ వృద్ధ రైతు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News