చండీగఢ్: ఈనెల 26న బ్లాక్‌డేను పాటించడానికి పిలుపు రావడంతో పంజాబ్ రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకోడానికి కదం తొక్కుతున్నారని భర్తీ కిసాన్ యూనియన్ (ఏక్తాఉగ్రహాన్) నేతలు సింగర సింగ్ తదితరులు వెల్లడించారు. ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ నుంచి ఢిల్లీ సింఘు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతులు ఆందోళన సాగిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 12 నుంచి కేంద్ర ప్రభుత్వానికి, రైతులకు మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. పెద్దలు, యువకులు, మహిళలతోపాటు రైతులంతా తమ నిత్యావసరాలను వాహనాలపై సరిహద్దులకు తీసుకు వెళ్తున్నారని వారం తరువాత వీరికి బదులు మరో గ్రూపు వస్తుందని చెప్పారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా తన ఇంటి వద్ద నల్లజెండా ఎగుర వేస్తానని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిధు చెప్పారు.
Punjab Farmers moved to Delhi Borders against Farm Laws