ఛండీగఢ్: ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లు రాణించారు. కీలక వికెట్ల తీసి ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు. దీంతో పంజాబ్.. బెంగళూరుకి 158 పరుగుల టార్గెట్‌ని ముందుంచింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించింది. కానీ కృనాల్ పాండ్యా ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య(22) వికెట్ తీసి ఈ భాగస్వామ్యానికి బ్రేక్ వేశాడు. ఆ తర్వాత సమయానికే మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్(33)ని కూడా కృనాల్ ఔట్ చేశాడు.
అనంతరం శ్రేయస్ అయ్యర్(6) కూడా షెపర్డ్ బౌలింగ్‌లో తన వికెట్‌ని కోల్పోయాడు. మరోవైపు జోష్ ఇంగ్లిస్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. కానీ, ఇంగ్లిస్(29) కూడా సుయాష్ శర్మ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. చివర్లో బ్యాటింగ్ చేసిన శశాంక్ సింగ్(31), మార్కో యాన్సన్(25) కాస్త స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బెంగళఊరు బౌలింగ్‌లో సుయాష్, కృనాల్ చెరి రెండు, షెపర్డ్ ఒక వికెట్ తీశారు.