Wednesday, January 22, 2025

పంజాబ్ సిఎంకు ఊరట.. ప్రత్యేక అసెంబ్లీకి గవర్నర్ ఓకే

- Advertisement -
- Advertisement -

Punjab Governor allows to CM for Special Assembly

చండీగఢ్: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బల నిరూపణ చేసుకోవాలని భావిస్తున్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు ఊరట లభించింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి చివరి క్షణంలో నిరాకరించి ఆమ్‌ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చిన గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఎట్టకేలకు ఓకే చెప్పారు. ఈమేరకు ట్విట్టర్ ద్వారా ఆప్ ఎమ్‌ఎల్‌ఎ, అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్యాన్ వెల్లడించారు. మా వినతికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈనెల 27న మంగళవారం అసెంబ్లీ మూడో సెషన్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారని స్పీకర్ పేర్కొన్నారు.

అయితే, ఈ ప్రత్యేక సమావేశాల్లో విశ్వాస పరీక్ష నిర్వహిస్తారా? లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియటం లేదని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు సెప్టెంబర్ 27న ప్రారంభం కానున్న ప్రత్యేక సమావేశాలను రాష్ట్రంలోని పంట వ్యర్ధాల కాల్చివేత, విద్యుత్ రంగం సమస్యలపై చర్చించేందుకు ఉపయోగించుకుంటామని ఆప్ ప్రభుత్వం చెబుతోంది. బీజేపీ ఆపరేషన్ లోటస్ పేరుతో ఎమ్‌ఎల్‌ఎలను కొనుగోలు చేస్తోందన్న ఆరోపణల మధ్య తమ బల నిరూపణ చేసుకునేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 22 న విశ్వాస పరీక్ష నిర్వహిస్తామని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. అయితే.. చివరి క్షణంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ నిరాకరించి ఆప్‌కు షాక్ ఇచ్చారు. దీంతో గవర్నర్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Punjab Governor allows to CM for Special Assembly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News