- Advertisement -
ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది మూడో గెలుపు కావడం విశేషం. ఇక చెన్నై ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 42 బంతుల్లోనే 9 సిక్సర్లు, ఏడు ఫోర్లతో 103 పరుగులు చేశాడు. మిగతా వారిలో శశాంక్ సింగ్ 36 బంతుల్లో 52 (నాటౌట్), మార్కొ జాన్సన్ 19 బంతుల్లో 34 (నాటౌట్) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (36), డెవోన్ కాన్వే (69) రాణించినా ఫలితం లేకుండా పోయింది.
- Advertisement -