ఐపిఎల్‌లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ మార్‌క్రమ్ (28), నికోలస్ పూరన్ (44), అయూష్ బడోని (41), అబ్దుల్ సమద్ (27), డేవిడ్ మిల్లర్ (19) పరుగులు చేశారు. కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 16.2 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరా అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. చెలరేగి ఆడిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 34 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. అయ్యర్ 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52, వధేరా 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
పంజాబ్‌కు రెండో గెలుపు
- Advertisement -
- Advertisement -
- Advertisement -