చెన్నై: వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్‌కు ముంబై ఇండియన్స్‌తో జరిగే పోరు కీలకంగా మారనుంది. రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాయి. ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించిన పంజాబ్.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములతో ఢీలా పడింది. మరోవైపు ముంబై కూడా ఈసారి సమిష్టిగా రాణించడంలో విఫలమవుతోంది. లీగ్‌లో ఇప్పటి వరకు 26 మ్యాచ్‌ల్లో తలపడగా 14 మ్యాచ్‌ల్లో ముంబై గెలుపొందగా, 12 మ్యాచ్‌ల్లో పంజాబ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపొంది తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే మూడు మ్యాచుల్లో ఓటమి పాలైన పంజాబ్ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇక ముంబై ఇండియన్స్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే అని చెప్పాలి. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఘోర పరాజయం పాలైన ముంబై ఈ మ్యాచ్‌లో గెలుపే లక్షంగాపెట్టుకుంది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం గా కనిపిస్తోంది.