- Advertisement -
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. మొదట టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రియాంశ్ ఆర్య(47; 23 బంతుల్లో ) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ( 97; 42 బంతుల్లో 9 సిక్స్ లు, 5 ఫోర్లు ),శకాంక్ సింగ్ (20) పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
- Advertisement -