Wednesday, March 26, 2025

గుజరాత్ పై పంజాబ్ విజయం

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ సీజన్18 లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యా చ్‌లో పంజాబ్ 11 పరుగుల తేడాతో విజ యం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసి న పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. తర్వాత బ్యా టింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 232 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (74), శుభ్‌మన్ గిల్ (33) శుభారంభం అందించారు. జోస్ బ ట్లర్ (54), రూథర్‌ఫోర్ట్ (46) రాణించినా ఫలితం లేకుండా పోయింది.

అయ్యర్ జోరు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు ఓపెనర్ ప్రియాన్ష్‌ఆర్యా అండ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఆర్యా 23 బంతుల్లోనే ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. అతనికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌అండగా నిలిచాడు. ఇక కెప్టెన్ అయ్యర్ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. అద్భుత బ్యాటింగ్‌తో గుజరాత్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అయ్యర్‌ను కట్టడి చేసేందుకు టైటాన్స్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ వరుస ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. చిరస్మరణీయ బ్యాటింగ్‌తో అలరించిన అయ్యర్ 42 బంతుల్లోనే 9 భారీ సిక్సర్లు, ఐదు ఫోర్లతో 97 పరుగు లు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమం లో సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచి పోయాడు. మరోవైపు శశాంక్ సింగ్ కూడా తన మార్క్ విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడు. చెలరేగి ఆడిన శశాంక్ 16 బంతుల్లోనే 6 ఫోర్లు, రెండు సిక్స్‌లతో అజేయంగా 44 పరుగులు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News