Sunday, January 19, 2025

రాజస్థాన్ పై పంజాబ్ విజయం

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌కు పరాజయం ఎదురైంది. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.

ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పరాగ్ ఆరు ఫోర్లతో 48 పరుగులు సాధించాడు. కెప్టెన్ శాంసన్ (18), ఓపెనర్ కడ్‌మోర్ (18), అశ్విన్ (28) మాత్రమే కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో హర్షల్, చాహర్, శామ్ కరన్ మెరుగ్గా రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 18.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ సామ్ కరన్ 63 (నాటౌట్) జట్టును గెలిపించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News