Tuesday, November 5, 2024

అమరీందర్ కొత్త పార్టీ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’

- Advertisement -
- Advertisement -
Punjab Lok Congress will be Amarinder new party
కాంగ్రెస్‌కు అధికారికంగా రాజీనామా చేసిన కెప్టెన్
మీ ప్రవర్తన నన్ను తీవ్రంగా బాధించిందంటూ సోనియాకు లేఖ

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. అంతేకాదు తాను కొత్తగా పెట్టబోయే పార్టీ పేరును ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ గా ప్రకటించారు. త్వరలోనే పార్టీని అధికారికంగా ఆవిష్కరిస్తామని, ఎన్నికల కమిషన్ పార్టీ పేరుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని కూడా ఆయన చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తుందని అమరీందర్ చెప్పారు. కాంగ్రెస్‌తో తాను తెరవెనుక మంతనాలు జరుపుతున్నటు వచ్చిన వార్తలను ఖండించిన కొద్ది రోజులకే అమరీందర్ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేయడంతో పాటుగా కొత్త పార్టీ పేరును కూడా ప్రకటించడం గమనార్హం.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపిన ఏడు పేజీల లేఖలో ఆమెతో పాటుగా ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ప్రవర్తించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. ‘ మీరు, మీ పిల్లలు ప్రవర్తించిన తీరు నిజంగా నన్ను తీవ్రంగా బాధించింది. మీ పిల్లలను నేను ఇప్పటికీ ఎంతో ప్రేమిస్తున్నాను. వారి తండ్రి నాకు 1954నుంచి అంటే 67 ఏళ్లనుంచి తెలుసు. బడిలో చదువుకునే రోజులనుంచే తెలుసు. అందు వల్ల నా పిల్లలను ప్రేమించినంతగా వారిని ప్రేమిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూపై కూడా ఆయన ఈ లేఖలో విమర్శలు గుపించారు. సిద్ధూ పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారని, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను, ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాను బహిరంగంగానే ఆలింగనం చేసుకున్నారని గుర్తు చేశారు. తాను తీవ్రంగా అభ్యంతరం చెప్పినప్పటికీ సిద్ధూను పంజాబ్ పిసిసి అధ్యక్షుడిని చేశారన్నారు. పంజాబ్‌తో పాటు దేశ ప్రయోజనాల కోసం తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News