Monday, December 23, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్

- Advertisement -
- Advertisement -

 

లక్నో: ఐపిఎల్‌లో భాగంగా భారత రత్నా శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ – పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ 14 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 108 పరుగులతో ఆటను కొనసాగిస్తుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 160 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ముందు ఉంచింది. అతర్వ్ టైడ్ పరుగులేమీ చేయకుండా యుధ్వీర్ సింగ్ బౌలింగ్‌లో అవీష్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. పభ్‌సిమ్రాన్ సింగ్ నాలుగు పరుగులు చేసి యుధ్వీర్ సింగ్ బౌలింగ్ క్లీన్ బౌల్డయ్యాడు. మాథ్యూ షార్ట్ 34 పరుగులు చేసి కె గౌతమ్ బౌలింగ్‌లో స్టయినీస్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. హర్‌ప్రీత్ సింగ్ భాటియా 22 పరుగులు చేసి కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో యుధ్వీర్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో సికిందర్ రాజా(43), సామ్ కరన్(1) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News