Monday, December 23, 2024

సిక్కు మానసిక వికలాంగుడిని చావబాది చంపేశారు

- Advertisement -
- Advertisement -

ఫిరోజ్ పూర్: గురుద్వారాలో ఓ యువకుడు అపవిత్రంగా వ్యవహరించాడని సిక్కు మతస్తులు అతడిని చావబాది చంపేశారు. సిక్కుల పవిత్ర గ్రంథం అయిన ‘గురు గ్రంథ్ సాహిబ్’ లోని కొన్ని పేజీలను చించేయడమే అతడు చేసిన నేరం. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

బండాలా గ్రామంలోని గురుద్వారా బాబా బీర్ సింగ్ ప్రాంతంలో 19 ఏళ్ల బక్షీష్ సింగ్ శనివారం అసభ్యంగా ప్రవర్తించాడు. సిక్కుల పవిత్ర గ్రంథంలోని కొన్ని పేజీలను  చించేశాడు.  ఆ తర్వాత అతడు పారిపోతుండగా పట్టుకున్నారు,  కట్టేసి దారుణంగా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బక్షీష్ సింగ్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మరణించాడు.  కాగా తన కుమారుడు మానసిక వికలాంగుడని, రెండేళ్లుగా ఔషధాలు వాడుతున్నామని బక్షీష్ సింగ్ తండ్రి లఖ్వీందర్ సింగ్ పోలీసులకు తెలిపాడు. తన కుమారుడిని కొట్టి చంపిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News